భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: జిల్లా వ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టరు కార్యాలయ పరిధిలో పనిచేసిన అధికారులలో, ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. త్రిపురారం మండలం మాటూరు గ్రామ పాలన అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న ప్రవీణ్ కుమార్ ఉత్తమ గ్రామపాలనా అధికారిగా ఎంపికయ్యారు. మిర్యాలగూడ సబ్ కలెక్టరు కార్యాలయంలో జరిపిన గణతంత్ర వేడుకల సందర్భంగా సబ్ కలెక్టర్ నారాయణన్ అమిత్ చేతులమీదుగా ప్రవీణ్ కుమార్ ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్‌ను పలువురు అభినందించారు.
BHARATH SAMACHAR DIGITAL
26, జనవరి 2026, సోమవారంభారత్ సమాచార్