భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

29, జనవరి 2026, గురువారంభారత్ సమాచార్

గుంతకంటి వీధిలో డ్రైనేజీ సమస్యపై ఆగ్రహం

84a8c61e-fd59-4245-a786-6b9a017861b0

భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: కోడుమూరులోని గుంతకంటి వారి వీధిలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను సీపీఎం మండల కార్యదర్శి వీరన్న గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కాలువలు రెండు వైపులా పూడిపోవడంతో మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్వాసనతో స్థానికులు రోజువారీ జీవనం సాగించలేకపోతున్నారని, మురుగు నీటితో అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి కాలువలను పూర్తిగా శుభ్రం చేయడంతో పాటు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యను నిర్లక్ష్యం చేస్తే ప్రజలతో కలిసి ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొని తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.