భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: మంత్రాలయం టీడీపీ ఇంఛార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు, ఆయన సోదరులు ఎన్.రామకృష్ణ రెడ్డి పులికనుమ ప్రాజెక్టు నుంచి పెద్దకడబూరు మండలానికి చెందిన ఎనిమిది గ్రామాలకు సాగునీటిని విడుదల చేశారు. సాగులో ఉన్న మొక్కజొన్న, మిరప, వేరుశనగ పంటలకు నీటి కొరత రాకుండా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ ఎన్. రామకృష్ణ రెడ్డి స్వయంగా ప్రాజెక్టు వద్ద జలహారతి చేసి నీటిని విడుదల చేశారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ చర్యతో ఎనిమిది గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేస్తూ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి, టీబీఎల్ ఎల్ఎల్సీ చైర్మన్ టిప్పు సుల్తాన్, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
29, జనవరి 2026, గురువారంభారత్ సమాచార్