భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

30, జనవరి 2026, శుక్రవారంభారత్ సమాచార్

వైఎస్సాఆర్ సీపీ పార్టీ కార్యాలయంలో గాంధీ వర్ధంతి

058979aa-1ea9-4639-805c-ab5277cb0913

భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఆదోనిలో వైఎస్సాఆర్ సీపీ పార్టీ కార్యాలయంలో వైఎస్సాఆర్ సీపీ ఆదోని నియోజకవర్గ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్ఆర్సిపి ఆదోని పట్టణ అధ్యక్షులు బీ.దేవా మాట్లాడుతూ.. భారతదేశ స్వాతంత్ర్య సాధన కోసం మహాత్మా గాంధీ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అహింస మార్గాన్ని ఎంచుకుని ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమాలతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కుదిపేశారని గుర్తు చేశారు. అహింసనే ఆయుధంగా చేసుకుని దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహానుభావుల్లో మహాత్మా గాంధీ ప్రముఖుడని పేర్కొన్నారు. యువత గాంధీజీ అడుగుజాడల్లో నడిచి అహింసా మార్గాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ టౌన్ సెక్రటరీ గోపాల్, టౌన్ కౌన్సిలర్ అశోక్, హరి, ఈశ్వర్, శ్రీధర్, సంజప్ప, రంగస్వామి, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు ఏసోబు నరసింహులు, ఇర్ఫాన్ బాషా, వీరన్న, రంగస్వామి వెంకోబా తదితరులు పాల్గొన్నారు.