భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

31, జనవరి 2026, శనివారంభారత్ సమాచార్

కర్నూలు ఎయిర్‌పోర్ట్ అభివృద్ధిపై సమావేశం

cda9d3b7-7cf7-48d4-99eb-ef44039afe62

భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: కర్నూలు విమానాశ్రయంలో ఏరోడ్రోం కమిటీ, ఎయిర్ ఫీల్డ్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశాలను జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి నిర్వహించారు. ఈ సమావేశాల్లో విమానాశ్రయ అభివృద్ధి, ప్రయాణికుల భద్రత, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పలు అంశాలపై సంబంధిత అధికారులతో విస్తృతంగా చర్చించారు. విమానాల రాకపోకల్లో భద్రతా ప్రమాణాలు పాటించడంతో పాటు పరిసర ప్రాంతాల్లో పర్యావరణ సమతుల్యత కాపాడాల్సిన అవసరాన్ని కలెక్టర్ పేర్కొన్నారు. శబ్ద కాలుష్యం నియంత్రణ, వ్యర్థాల నిర్వహణ, హరితీకరణ చర్యలపై సూచనలు చేశారు. అలాగే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశాల్లో వివిధ శాఖల అధికారులు, విమానాశ్రయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.