భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

31, జనవరి 2026, శనివారంభారత్ సమాచార్

కౌతాళంలో త్రయంబకేశ్వరస్వామి వార్షికోత్సవం

55d946e6-be97-406e-aff7-06abd9cc62ea

భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: కౌతాళం పట్టణంలో వెలసిన పార్వతి దేవి సమేత త్రయంబకేశ్వర స్వామి దేవస్థానం మూడవ సంవత్సర వార్షికోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో వేడుకలు జరిపారు. ఉరుకుంద ఈరన్న మాజీ ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ చెన్న బసప్ప, ఆయన సోదరుడు కాశీ విశ్వనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వీరశైవ లింగాయత్ సంఘం కోరిక మేరకు వరుసగా మూడవసారి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదానాన్ని స్వీకరించారు. ఆలయ వార్షికోత్సవం సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, నిర్వాహకులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.