భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: గాంధీ వర్ధంతి సందర్భంగా పత్తికొండ అంబేద్కర్ సర్కిల్ వద్ద సీపీఎం పార్టీ, వ్యవసాయ కార్మిక సంఘం, ఉపాధి హామీ కూలీలు సంయుక్తంగా ప్రతిజ్ఞా-నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజానాట్యమండలి నాయకులు కాశన్న అధ్యక్షత వహించారు. సీపీఎం సీనియర్ నాయకులు దస్తగిరి, కార్యదర్శి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, మహాత్మా గాంధీ పేరు ఉపాధి హామీ చట్టం నుంచి తొలగించడం కోట్లాది ప్రజల మనోభావాలను గాయపరిచిందన్నారు. వెంటనే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించి, కొత్తగా తీసుకొచ్చిన వి-రాంజీ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నరసన్న, సీఐటీయూ మండల కార్యదర్శి రవిచంద్ర మాట్లాడుతూ.. నాలుగు నెలలుగా కూలీల వేతనాలు పెండింగ్లో ఉంచి పనులు కల్పించకపోవడాన్ని ఖండించారు. కార్మిక హక్కులను హరించే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ, రైతు సంఘం, ఆటో వర్కర్స్ సంఘం తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
31, జనవరి 2026, శనివారంభారత్ సమాచార్