భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

31, జనవరి 2026, శనివారంభారత్ సమాచార్

ప్రశాంతంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలి: కలెక్టర్ సిరి

780d4f3d-73c2-4729-831b-8f17f49b7fcc

భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఫిబ్రవరి 23వ తేది నుంచి మార్చి 24వ తేది వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లతో ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సంబధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 23 వ తేది నుండి మార్చి 24 వ తేది వరకు 75 సెంటర్ల లో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పరీక్షల నిర్వహణకు ఆయా శాఖల అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రశ్నా పత్రాల భద్రతకు ఆర్మ్డ్ గార్డ్స్ ఏర్పాటు తో పాటు పరీక్ష కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్ పోలీస్ అధికారులను ఆదేశించారు.

 

 

ప్రశ్నా పత్రాలు స్టోరేజ్ పాయింట్ నుంచి పరీక్ష కేంద్రాలకు వెళ్లే వరకు పోలీసు ఎస్కార్ట్ ఉండాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని, పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి ఎగ్జామినేషన్ హాల్ లో త్రాగు నీరు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో సరిపడా లైటింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పరిశుభ్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు.. ఫస్ట్ ఎయిడ్ కిట్స్, అవసరమైన మందులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాలకు బస్సు సౌకర్యం ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని apspdcl అధికారిని ఆదేశించారు. సమావేశంలో ఆర్ఐఓ లాలప్ప, సర్వశిక్ష అభియాన్ పిఓ లోక్ రాజ్, డీఈవో సుధాకర్, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ డి ఈఈ నరేష్, 3 టౌన్ ఎస్ఐ పీరయ్య, కలెక్టరేట్ ఏవో శివరాముడు, అసిస్టెంట్ కమిషనర్ లేబర్ సాంబ శివ, ఏపీ ఎస్పీడీసీఎల్ డీఈ విజయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.