భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

31, జనవరి 2026, శనివారంభారత్ సమాచార్

టీటీడీ లడ్డూ విషయంలో తప్పుడు ప్రచారం మానాలి: కంగాటి శ్రీదేవమ్మ

782c003d-1802-4584-b0da-29db0a9ecc15

భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: తిరుమల లడ్డూలో ఎలాంటి జంతు కొవ్వు కలపలేదని సుప్రీంకోర్టు, సీబీఐ స్పష్టమైన తుది తీర్పు ఇచ్చినా పచ్చ మీడియా, టీడీపీ నాయకులు కావాలనే ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ విమర్శించారు. కోట్లాది హిందువుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రతను రాజకీయ లాభాల కోసం దెబ్బతీయడం దుర్మార్గమని ఆమె అన్నారు. ఈ దుష్ప్రచారం మానాలని కోరుతూ కృష్ణగిరి మండలం కర్లకుంట గ్రామంలో తిరుమల రాయుడు సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజం ఎప్పటికైనా గెలుస్తుందని ప్రజలు గుర్తించాలని పిలుపునిచ్చారు.