భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

1, ఫిబ్రవరి 2026, ఆదివారంభారత్ సమాచార్

నవోదయం 2.0తో బంగారుపేటకు ఉపాధి

23535990-9aaf-43da-9eae-ca7f46d612e2

భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: నవోదయం 2.0 పథకం కింద నాటు సారా తయారీని విరమించిన బంగారుపేట గ్రామ వాసులకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించింది. ఇండియన్ బ్యాంక్ సహకారంతో లబ్ధిదారులకు ఆటోలు, తోపుడు బండ్లు, కాంక్రీట్ మిక్సర్లను మంజూరు చేశారు. ఈ వాహనాలు, పరికరాలను శనివారం జిల్లా కలెక్టర్ ఏ. సిరి కలెక్టరేట్లో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాటు సారా తయారీ వంటి అక్రమ కార్యకలాపాలను పూర్తిగా విడిచిపెట్టి గౌరవప్రదమైన ఉపాధి మార్గాల్లో స్థిరపడాలని సూచించారు. నవోదయం 2.0 పథకం ద్వారా లబ్ధిదారుల కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధి లభిస్తుందని, ఆర్థికంగా బలోపేతం కావడానికి ఇది దోహదపడుతుందని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.