భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: కార్మిక చట్టాల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్స్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను కార్మిక వర్గం పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టీయూ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన కార్మిక సంఘాల సమావేశానికి ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి విజేంద్ర అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ తాలూకా అధ్యక్ష, కార్యదర్శులు వీరేష్, తిమ్మాగురుడు, సిఐటియు మండల కార్యదర్శి రాముడు, ఐఎఫ్టియూ జిల్లా నాయకుడు రాజు, ఏఐటీయూసీ తాలూకా సహాయ కార్యదర్శి రంగన్న తదితరులు మాట్లాడారు. 1926 నుంచి కార్మికులు పోరాటాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, కార్పొరేట్ల ప్రయోజనాల కోసం నాలుగు లేబర్ కోడ్స్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. వెంటనే లేబర్ కోడ్స్‌తో పాటు విత్తన చట్టం–2025, విద్యుత్ చట్టం–2025, వీజీబీ, రామ్‌జీ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టియూ నాయకులు ఖాజు, సురేష్, మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు శివ, ఎల్లప్ప, ప్రతాప్, నాగరాజు, నరసింహులు, ప్రసాద్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
1, ఫిబ్రవరి 2026, ఆదివారంభారత్ సమాచార్