భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: కేరళ రాష్ట్రంలో మాస్టర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన 46వ జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఆదోని పట్టణానికి చెందిన శ్వేత అద్భుత ప్రతిభను చాటారు. శనివారం జరిగిన పోటీల్లో ఆమె మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. జాతీయ స్థాయిలో పతకం సాధించడం ఆదోని పట్టణానికి గర్వకారణమని క్రీడాభిమానులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా కోఆర్డినేటర్ సురేంద్ర, రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్ శ్వేతను అభినందించారు. కష్టపడి శ్రమిస్తే ఉన్నత స్థాయిలో విజయం సాధించవచ్చని ఆమె నిరూపించిందని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. శ్వేత సాధించిన ఈ విజయం యువ క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తుందని పలువురు పేర్కొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
1, ఫిబ్రవరి 2026, ఆదివారంభారత్ సమాచార్