భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: రాయలసీమ యూనివర్సిటీలో కొత్త స్వయం ఉపాధి కోర్సులు ప్రవేశపెట్టాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి శరత్ కుమార్ డిమాండ్ చేశారు. ఇవాళ ఉపకులపతి వెంకట బసవరావును కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రైవేట్ కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల వల్ల విద్యార్థులపై అధిక ఆర్థిక భారం పడుతోందని తెలిపారు. కొత్త కోర్సులు ప్రారంభిస్తే పేద విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, వారి ఆర్థిక భారాన్ని తగ్గించగలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ కోర్సులు విద్యార్థుల కెరీర్ అభివృద్ధికి దోహదపడతాయని, రాష్ట్రంలోని ఇతర విద్యా సంస్థలతో సమన్వయం అవసరమని శరత్ కుమార్ సూచించారు.
BHARATH SAMACHAR DIGITAL
1, ఫిబ్రవరి 2026, ఆదివారంభారత్ సమాచార్