భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

1, ఫిబ్రవరి 2026, ఆదివారంభారత్ సమాచార్

పలుగుతండాలో 25 కెవిఏ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు

4

భారత్ సమాచర్, నల్గొండ జిల్లా: లో వోల్టేజి సమస్యలను నివారించడానికి తెలంగాణ విద్యుత్ శాఖ ప్రతీ గ్రామంలో కొత్త ట్రాన్స్ఫార్మర్ లను ఏర్పాటు చేయడం, కొత్త స్థంభాలు వేసి విద్యుత్ సరఫరా చేస్తుంది. అందులో భాగంగానే నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం పలుగుతండా గ్రామంలో లోవోల్టేజి సమస్యను నివారించడానికి నూతనంగా 25 కెవిఏ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. దీన్ని పలుగుతండాకు గ్రామపంచాయతీ సర్పంచ్ రమేష్ నాయక్ ప్రారంభించి మాట్లాడారు. గ్రామంలో ఎన్నో రోజులుగా ఉన్న విద్యుత్తు ఇబ్బందులు ఈరోజుతో తొలిగిపోయాయి. గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్న వెంటనే పరిష్కరిస్తాని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లైన్ మెన్ మోతీలాల్ నాయక్, పలుగుతండా గ్రామపంచాయతీకి చెందిన మూడు శంకర్ నాయక్, ముని నాయక్, గ్రామపంచాయతీ సిబ్బంది నాగు నాయక్, చతృ నాయక్, ఆర్.బికన్, ఆర్. హునా, గ్రామపంచాయతీ వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.