భారత్ సమాచార్, కర్నూలు జిల్లా : ఆదోని పట్టణంలో ఏర్పాటు చేసిన కొత్త ట్రాఫిక్ సిగ్నల్స్ వల్ల ప్రజలకు ఇబ్బందులు పెరిగాయని ఎం.హెచ్.పి.ఎస్ రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ విమర్శించారు. భీమా సర్కిల్, బాలాజీ సర్కిల్ వంటి అవసరం లేని ప్రాంతాల్లో సిగ్నల్స్ కారణంగా వాహనదారులు నిమిషాల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని అన్నారు. గతంలో రూ.10 లక్షలతో ఏర్పాటు చేసిన సిగ్నల్స్ తొలగించి రూ.36 లక్షలతో కొత్తవి కొనడంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. రోడ్ల విస్తరణ లేకుండా ట్రాఫిక్ సమస్యలు తీరవని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరుతూ స్పందించకపోతే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
BHARATH SAMACHAR DIGITAL
1, ఫిబ్రవరి 2026, ఆదివారంభారత్ సమాచార్