భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: లో వోల్టేజి కారణంగా విద్యుత్తు సమస్యలతో ఇబ్బంది పడుతున్న మాటూరు గ్రామస్థుల సమస్యలను తీర్చడానికి గ్రామపంచాయతీ సర్పంచ్ వెంకట్రాం నాయక్, గ్రామంలో కొత్తగా స్థంభాలను ఏర్పాటుచేసే కార్యక్రమం చేపట్టారు. నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం మాటూరు గ్రామపంచాయతీ పరిధిలో ఆదివారం అక్కడక్కడా నూతనంగా విద్యుత్తు స్థంభాలను ఏర్పాటు చేయించారు. గ్రామంలో కొత్తగా యల్.టి ఇంటర్ పోల్స్ ఏర్పాటు చేయడం, వీధి దీపాలు లేని స్థంభాలకు కొత్తగా విద్యుత్తు దీపాలను పెట్టించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ ధానావత్ రవి నాయక్, మాజీ ఉపసర్పంచ్ ధానావత్ శంకర్ నాయక్, డీలర్ ధానావత్ రాములు నాయక్, లైన్ మెన్ మోతీలాల్ నాయక్, మాజీ విద్యాకమిటీ ఛైర్మన్ ధానావత్ రతన్ నాయక్, గ్రామ పెద్దలు ధానావత్ శ్రీరామ్ నాయక్, ధానావత్ సూక్య నాయక్, యువనాయకులు కలకొండ శివశంకర మల్లయ్య, పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.