భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: ఘనపూర్ మండలం సోలిపూర్ జడ్పిహెచ్ఎస్లో 2000-01 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. స్థానిక పాఠశాల నిర్వహించిన 25ఏళ్ల రజతోత్సవ వేడుకకు పూర్వ విద్యార్థులంతా తమ చిన్ననాటి గుర్తులను నెమరువేసుకున్నారు. అంతకుముందు ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకుని నాటి మధురజ్ఞాపకాలను గుర్తుకు చేసుకున్నారు. అనంతరం తమకు విద్యాబుద్దులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆటపాటలు విందు వినోదాలతో రోజంతా ఉత్సాహంగా గడిపారు.