భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

3, ఫిబ్రవరి 2026, మంగళవారంభారత్ సమాచార్

నమ్మకాన్ని వమ్ము చేయను.. అభివృద్ధి చేస్తా

e855a627-2956-4a85-b2f4-2de89c0e0d96

భారత్ సమాచార్, కామారెడ్డి జిల్లా: మద్నూర్ మండలం సోముర్ గ్రామ ప్రజలు తమపై ఎంతో నమ్మకంతో గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి పనుల్లో నిమగ్నమయ్యామని సర్పంచ్ సంగ్రామ్ పటేల్ అన్నారు. గ్రామంలోని పాఠశాల అవరణలో చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్ర పరిచినట్లు, విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చేశామన్నారు. అలాగే సోమూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అవసరమైన అభివృద్ది పనులు, ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తామన్నారు. గ్రామంలో నీటి సమస్య లేకుండా ప్రతి నీటి మోటారును శుభ్ర పరిచామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హన్మంత్, మాణిక్, మల్లికార్జున్, గంగాధర్, శివరాజ్, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.