భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

4, ఫిబ్రవరి 2026, బుధవారంభారత్ సమాచార్

22 స్థానాల్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాం: పట్నం మాణిక్యం

e322fbf4-ee8e-4d31-a07a-1ad3585abf8f

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: గుమ్మడిదల మున్సిపాలిటీలోని 22 వార్డుల్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పార్టీ పూర్తిస్థాయిలో ఎన్నికల బరిలో నిలిచిందని మున్సిపల్ ఇంఛార్జ్ పట్నం మాణిక్యం స్పష్టం చేశారు. పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని, నాయకత్వం నుంచి బూత్ స్థాయి కార్యకర్త వరకు అందరూ ఒకే దిశగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. పార్టీ నిర్ణయాలపై స్పష్టత ఉందని, అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత పాటించామని వివరించారు. ఎవరికీ అన్యాయం జరగలేదని, పార్టీ ప్రయోజనాలే ప్రధానంగా నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. పార్టీ నిర్ణయాలే అందరికీ మార్గదర్శకమని, వాటిని గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని, ప్రతి వార్డులో పార్టీ కమిటీలు చురుగ్గా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఇంటింటి ప్రచారం క్రమబద్ధంగా కొనసాగుతోందని, ప్రజల్లో పార్టీపై విశ్వాసం పెరుగుతోందని తెలిపారు. గత పాలనలో మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి పనులే ఎన్నికల్లో పార్టీకి ప్రధాన బలంగా నిలుస్తాయని స్పష్టం చేశారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, మౌలిక వసతుల అభివృద్ధిలో బీఆర్ఎస్ చేసిన పనులను ప్రజలు గుర్తుంచుకుంటున్నారని చెప్పారు.

 

బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న 22 మంది అభ్యర్థులకు పార్టీ బీఫామ్‌లను అధికారికంగా అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మున్సిపల్ ఇంచార్జ్ పట్నం మాణిక్యం ముఖ్యఅతిథిగా హాజరై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వార్డులో పార్టీ కమిటీలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, ప్రచారంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా కార్యాచరణ సాగుతోందని తెలిపారు. అనవసర వ్యాఖ్యలు, అపోహలకు తావివ్వకుండా ప్రతి ఒక్కరూ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

 

ఎన్నికల రోజు వరకు ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని, బూత్ స్థాయి నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. ప్రతి ఓటరును కలవాలని, పార్టీ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు స్పష్టంగా వివరించాలని తెలిపారు. గుమ్మడిదల మున్సిపాలిటీలో 22 స్థానాల్లో బీఆర్ఎస్ విజయమే తుది లక్ష్యమని, అదే దిశగా పార్టీ శ్రేణులు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని పట్నం మాణిక్యం స్పష్టం చేశారు. పార్టీ ఐక్యతే ఈ ఎన్నికల్లో విజయానికి ప్రధాన బలమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కోఆర్డినేటర్ తొంట ఆంజనేయ యాదవ్, మండల పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ కుమార్ గౌడ్, దేవేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజశేఖర్, హుస్సేన్, మొగులయ్య, పొన్నాల శ్రీనివాస్ రెడ్డి, సూర్యనారాయణ, పి.శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రెడ్డి ఫయాజ్, పోచయ్య, సత్యనారాయణ, వీరస్వామి గౌడ్, నాయకులు పాల్గొన్నారు.