భారత్ సమాచార్.నెట్, సిద్దిపేట: రాఖీ పండుగ వేళ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సిద్దిపేటలో తన సోదరుడికి రాఖీ కట్టేందుకు వెళ్తున్న పల్లవి తన కూతురు శృతిని రోడ్డు ప్రమాదంలో కోల్పోయిన ఘటన హృదయ విదారక ఘటన శనివారం రాజీవ్ రహదారిపై జరిగింది. సిద్దిపేట టూటౌన్ సీఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నకోడూరు మండలం గోనెపల్లికి చెందిన తాళ్లపల్లి పర్శరాములు కుమార్తె శృతి (24) గజ్వేల్‌లో నివాసముంటున్నారు. తన సోదరుడు నాగిళ్ల శ్రీనివాస్‌కు రాఖీ కట్టేందుకు తల్లితో కలిసి సిద్దిపేటకు వెళ్లగా, శ్రీనివాస్ వారిని కారులో తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో రాజీవ్ రహదారిపై కేసీఆర్ నగర్ వద్ద కారు టైర్ పగిలి, వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు వెనుక సీట్లో కూర్చున్న శృతి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందింది. శ్రీనివాస్, పల్లవి స్వల్పగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తండ్రి పర్శరాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.
మరిన్ని కథనాలు
ఆటో ట్రాలీ, బైక్ ఢీ.. ఒకరి పరిస్థితి విషమం