భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, ఆగస్టు 2025, సోమవారంభారత్ సమాచార్

గుర్తుతెలియని వ్య‌క్తి మృతదేహం కలకలం

04

భార‌త్ స‌మాచార్.నెట్‌, శ్రీకాకుళం: వంశధార నది తీరంలోని తెలికిపెంట బ్రిడ్జి వద్ద గుర్తుతెలియని మృతదేహం ఉండ‌డంతో ఆదివారం కలకలం రేగింది. అయితే ఇది హత్య కాదని, అంత్యక్రియలపై తలెత్తిన వివాదమని పోలీసులు తెలిపారు. వివ‌రాలిలా.. జలుమూరు మండలం కొండ కామేశ్వరపేటకి చెందిన ఒక బిచ్చగాడు అనారోగ్యంతో మరణించాడు. వంశధార నది అవతలి ఒడ్డున దహన సంస్కారాలు చేయడానికి వీలు లేకపోవడంతో గ్రామస్థులు తెలికిపెంట బ్రిడ్జి సమీపంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అయితే, దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన తెలికిపెంట గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు జోక్యం చేసుకుని, ఇరుపక్షాలకు ఇబ్బంది లేని ప్రదేశంలో అంత్యక్రియలు నిర్వహించేలా చూడటంతో వివాదం సద్దుమణిగింది. దీనితో బ్రిడ్జి వద్ద మృతదేహం గురించిన భయాందోళనలు తొలగిపోయాయి.

 

మ‌రిన్ని క‌థ‌నాలు

7.2 కిలోల‌ గంజాయి స్వాధీనం.. నలుగురి అరెస్ట్