భారత్ సమాచార్.నెట్, గుంటూరు: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గొప్ప మనసు చాటుకున్నారు. దుగ్గిరాల నుంచి తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి పడి ఉన్న వృద్ధుడిని చూసి తన కాన్వాయ్‌ను ఆపారు. ఆదివారం పెదవడ్లపూడికి చెందిన వెంకటేశ్వరరావు తన బైక్ పై వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. రక్తం ఎక్కువగా పోవడం గమనించిన డాక్టర్ పెమ్మసాని, వెంటనే కారు దిగి ఆయనకు అందుబాటులో ఉన్న దుస్తులతో కట్టుకట్టి ప్రథమ చికిత్స అందించారు. తన సొంత వాహనంలో వెంకటేశ్వరరావును మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. అత్యవసర పనులు ఉన్నప్పటికీ, ఒక సాధారణ వ్యక్తి కోసం కేంద్ర మంత్రి చూపిన మానవత్వాన్ని ప్రజలు ప్రశంసిస్తున్నారు.
మరిన్ని కథనాలు
కొల్లిపరలో భారీగా గంజాయి పట్టివేత.. 13 మంది అరెస్ట్