భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

12, ఆగస్టు 2025, మంగళవారంభారత్ సమాచార్

పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన యువ‌కుడు.. యువతి ఆత్మహత్య

08

భార‌త్ స‌మాచార్.నెట్, మంచిర్యాల: ప్రేమించిన యువకుడు పెళ్లి చేసుకోనని బెదిరించడమే కాకుండా, డబ్బులు డిమాండ్ చేయడంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. జిల్లాకు చెందిన 23 ఏళ్ల యువతి, డిగ్రీ చదువుకునే రోజుల్లో తన కళాశాలకు చెందిన రంగుల శ్రీకాంత్‌ను ప్రేమించింది. అయితే, పెళ్లి ప్రస్తావన తీసుకురాగా, ఇద్దరి కులాలు వేరని, పెళ్లికి ఇంట్లో ఒప్పుకోరని శ్రీకాంత్ చెప్పాడు. కొద్ది రోజుల తర్వాత డబ్బులు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని బెదిరించాడు. శ్రీకాంత్ తల్లిదండ్రులు, సోదరుడు కూడా యువతితో మాట్లాడి కట్నకానుకలు డిమాండ్ చేశారు. లేకపోతే తమ వద్ద ఉన్న ఫోటోలు బయటపెడతామని బెదిరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిధులు: ఎంపీ