భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

2, మార్చి 2026, సోమవారంభారత్ సమాచార్

ఆక్రమణదారుల చెరలో నాలుగు దశాబ్దాల నాటి రహదారి..?

WhatsApp Image 2026-03-01 at 8.06.16 PM (2)

భారత్ సమాచార్.నెట్, నల్గొండ‌ : త్రిపురారం మండలంలోని బెజ్జికల్లు నుండి మిర్యాలగూడ మండలం బోనగిరి గుడిసెల వరకు ఉన్న పురాతన మెటల్ రోడ్డు అక్రమార్కుల స్వార్థానికి బలైపోయిందని స్థానికులు అంటున్నారు. సుమారు 40 ఏళ్లుగా మూడు గ్రామాలను కలుపుతూ, వందలాది ఎకరాల ధాన్యం రవాణాకు ఆధారమైన ఈ రహదారిని కొందరు పొలాల్లో కలిపేసుకున్నార‌ని అంటున్నారు. గతంలో ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు తిరిగిన ఈ మార్గంలో మినీ కల్వర్టులను సైతం ధ్వంసం చేసి సాగు భూమిగా మార్చడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల రామన్నపేట, లావుడితండా రైతులు తమ ధాన్యాన్ని తుంగపాడు మిల్లులకు తరలించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, ఆర్ అండ్ బీ అధికారులు స్పందించి, ఆక్రమణలను తొలగించి పూర్వపు రోడ్డును, వంతెనను నిర్మించాలని బెజ్జికల్లు, మర్రిగూడెం గ్రామస్థులు వేడుకుంటున్నారు.