భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: హత్నూర మండలంలోని తురకల ఖానాపూర్ లోని రత్నపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో ఫస్ట్ ఇయర్ విద్యార్థులను ఉపాధ్యాయుడు శివారెడ్డి చితకబాదాడు. కళాశాలలో ఫస్ట్ ఇయర్ విద్యార్థులను హోంవర్క్ చేయలేదని సుమారు 15 మంది విద్యార్థులను ఇష్టం వచ్చినట్లు అసభ్య పదజాలంతో తిడుతూ పక్కన దొరికిన కేబుల్ వైర్‌తో తమను చితకబాదినట్లు విద్యార్థులు తెలిపారు. చితకబాదిన తర్వాత విద్యార్థులు కన్నీరు మున్నీరయ్యారు. విద్యార్థులపై దురుసుగా ప్రవర్తించిన రత్నపురి కళాశాల ఉపాధ్యాయుడు శివారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు.