భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

14, మార్చి 2026, శనివారంభారత్ సమాచార్

పదోతరగతి పరీక్ష తొలి రోజు ప్రశాంతం

cc

భారత్ సమాచార్, మంచిర్యాల జిల్లా:  తాండూర్ మండలంలో పదోతరగతి పరీక్షలకు గాను ఏర్పాటు చేసిన 2 పరీక్ష కేంద్రాల్లో తొలి రోజు పరీక్షా ప్రశాంతంగా ముగిసింది. విద్యార్థులు మొదటి రోజు కావడంతో పరీక్ష కేంద్రాలకు ఉదయం 9గంటల లోపే చేరుకున్నారు. విద్యా శాఖ అధికారులు తనిఖీలు జరిపిన తరువాతే విద్యార్థులను గదుల్లోకి పంపారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మండలంలో మొత్తం 2 పరీక్ష కేంద్రాల్లో 417 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా, 416 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఒకరు గైర్హాజరయ్యారు. విద్యాభారతి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ సెంటర్లో 198 మంది విద్యార్థులకు గాను 198 హాజరయ్యారు. తాండూర్ హైస్కూల్ లో 219 మంది విద్యార్థులకు గాను 218 మంది హాజరైనట్లు. ఎంఈవో దుర్గం శ్రీనివాస్ తెలిపారు.