భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

15, మార్చి 2026, ఆదివారంభారత్ సమాచార్

కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులు బిజెపిలో చేరిక

1C

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: భారతీయ జనతా పార్టీ చిలిపిచేడ్ మండల అధ్యక్షులు అజమరి నగేష్ ఆధ్వర్యంలో బీజేపీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ అధ్యక్షతన మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు సమక్షంలో చిలిపిచేడ్ మండల పరిధిలోని గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులు భారీగా ఎంపి చేతుల మీదుగా బీజేపీ కండువా కప్పుకొని బీజేపీ పార్టీలో చేరారు. బీజేపీ పార్టీలో చేరిన వారిలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, శివ శంకర్ గౌడ్, మధు మల్లేష్ గౌడ్, బొగ్గుల శీను, చంద్ర గౌడ్, నర్సింలు, రమేష్ గౌడ్, బిక్షపతి, భవాని నరసింహులు, మంనే యాదగిరి, బిక్షపతి, పండరి, కూసంగి రమేష్. ఈ కార్యక్రమంలో ఓబిసిమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు రాజేందర్ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ గౌడ్ మాజీ సర్పంచ్ పాండురంగారెడ్డి మల్లేశం అనంతరామ్ గౌడ్ ఉన్నారు.