భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

20, మార్చి 2026, శుక్రవారంభారత్ సమాచార్

మెల్లూరులో వైభవంగా ఉగాది ఉత్సవాలు

WhatsApp Image 2026-03-19 at 9.43.37 PM

భారత్ సమాచార్.నెట్, మెదక్: వెల్దుర్తి మండలం మెల్లూరు గ్రామంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం పోచమ్మ అమ్మవారి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తమ ఎడ్లబండ్లను రంగురంగుల పూలతో అందంగా అలంకరించి, డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాల నడుమ గ్రామంలో భారీ ఊరేగింపు చేపట్టారు.

అనంతరం పోచమ్మ దేవాలయం చుట్టూ ఎడ్లబండ్లను తిప్పి భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ సర్పంచ్ రంగారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఉగాది సందర్భంగా గ్రామ దేవతలకు ఈ సంప్రదాయ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. ఈ వేడుకల్లో గ్రామస్తులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.