భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

24, మార్చి 2026, మంగళవారంభారత్ సమాచార్

నిజాంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

WhatsApp Image 2026-03-23 at 8.32.19 PM

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రెండు గూడ్స్ వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం సోమవారం మధ్యాహ్నం నిజాంపేట మండల కేంద్రంలోని రైతు వేదిక సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డికి చెందిన బండారి అశోక్ (50) తన యజమాని శ్రీనివాస్‌తో కలిసి టాటా ఏసీ వాహనంలో కిరాణా సరుకులతో సిద్దిపేట వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న మరో గూడ్స్ వాహనం అతివేగంగా వచ్చి ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో అశోక్ తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పక్కనే ఉన్న శ్రీనివాస్‌కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి భార్య నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు నిజాంపేట ఎస్సై రాజేష్ తెలిపారు.