భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, మార్చి 2026, గురువారంభారత్ సమాచార్

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

WhatsApp Image 2026-03-25 at 7.36.05 PM

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: చేపల వేట కోసం వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందిన ఘటన వెల్దుర్తి మండలం అందుగులపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నడిపెల గోపాల్ (45) మంగళవారం రాత్రి తన కుమారుడితో కలిసి గ్రామ శివారులోని పెద్ద చెరువుకు చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో గోపాల్ అకస్మాత్తుగా నీటిలో మునిగి గల్లంతయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు, నర్సాపూర్ ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం గోపాల్ మృతదేహాన్ని వెలికితీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.