భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, మార్చి 2026, గురువారంభారత్ సమాచార్

జంగరాయిలో వృద్ధ దంపతులపై సుత్తితో దాడి

WhatsApp Image 2026-03-25 at 8.10.45 PM

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: జంగరాయి గ్రామంలో పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. గుర్తుతెలియని దుండగుడు అంజయ్య, సావిత్రి అనే వృద్ధ దంపతుల నివాసంలోకి చొరబడి, వారిపై సుత్తితో కిరాతకముగా దాడి చేసి సుమారు 5 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లాడు. తీవ్రంగా గాయపడిన దంపతులను స్థానికులు చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించినట్లు ఆయన తెలిపారు. ఈ తనిఖీల్లో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ వెంకట రాజా గౌడ్, ఎస్సై నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.