భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

30, మార్చి 2026, సోమవారంభారత్ సమాచార్

డీజే సౌండ్ తగ్గించమన్నందుకు దారుణం

WhatsApp Image 2026-03-29 at 7.26.22 PM

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: అర్ధరాత్రి వేళ డిజే శబ్దాలు తగ్గించమని కోరినందుకు ఒక వ్యక్తిపై పగిలిన మద్యం సీసాతో దాడి చేసిన సంఘటన ముస్లాపూర్ గ్రామంలో కలకలం రేపింది. ఆదివారం తెల్లవారుజామున సుమారు ఒక గంట ప్రాంతంలో తిరుగు ప్రయాణంలో ఉన్న గ్రామస్థుడు శంకు నర్సింలు (55), మద్యం మత్తులో రికార్డు డ్యాన్సులు చేస్తున్న యువకులను సౌండ్ తగ్గించమని ప్రశ్నించారు.

దీంతో ఆగ్రహానికి గురైన చిట్టాకుల దుర్గయ్య, సతీష్ అనే వ్యక్తులు నర్సింలుతో వాగ్వాదానికి దిగి, పగిలిన సీసాతో ఆయన గొంతుపై బలంగా దాడి చేశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు వెంటనే బాధితుడిని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భర్తపై జరిగిన దాడిపై భార్య దుర్గమ్మ అల్లాదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి నిందితులపై దర్యాప్తు చేపట్టారు.