భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

30, మార్చి 2026, సోమవారంభారత్ సమాచార్

వైద్యులపై చర్య తీసుకోవాలని భర్త ఫిర్యాదు

WhatsApp Image 2026-03-29 at 8.21.59 PM (1)

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తన భార్య ఆత్మహత్యాయత్నానికి కారణమైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఎన్‌ఎం రజిని భర్త నర్సింగ్ రావు పోలీసులను ఆశ్రయించారు. వెల్దుర్తి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న రజిని, డాక్టర్ శిరీష, డాక్టర్ సౌజన్యల మానసిక వేధింపులు భరించలేక ఈ నెల 27న బలవన్మరణానికి ప్రయత్నించినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం రజిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆమె పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నర్సింగ్ రావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటరమణ, సుమన్, ఏఎన్ఎం 2 మంజుల, అనిల్ కుమార్, వెంకటేష్ పాల్గొన్నారు.