భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

2, ఏప్రిల్ 2026, గురువారంభారత్ సమాచార్

లింగంపల్లి వారధిపై రోడ్డు నిర్మించాలని డిమాండ్

WhatsApp Image 2026-04-01 at 6.59.57 PM

భారత్ సమాచార్.నెట్, మెదక్: మెదక్ – కామారెడ్డి జిల్లాలను కలిపే మంజీరా నదిపై రూ. 22 కోట్లతో నిర్మించిన లింగంపల్లి వారధి అసంపూర్తిగా మిగిలిపోయింది. వంతెన నిర్మాణం పూర్తయినా, మెదక్ జిల్లా వైపు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ప్రజలకు ప్రయాణ కష్టాలు తప్పడం లేదు. 2018లో ప్రారంభమైన ఈ బ్రిడ్జి పనులు 2022లో పూర్తయ్యాయి. కామారెడ్డి జిల్లా వైపు తారు రోడ్డు సిద్ధమైనప్పటికీ, పాపన్నపేట మండల పరిధిలోని రామతీర్థం నుండి 3.1 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించాల్సి ఉంది.

దీని కోసం సుమారు రూ. 22 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేసినా, భూసేకరణ మరియు నిధుల మంజూరులో జాప్యం జరుగుతోంది. ఈ రోడ్డు పూర్తయితే పాపన్నపేట, టేక్మాల్, రేగోడు మండలాల ప్రజలకు కామారెడ్డి వెళ్లేందుకు 50 కిలోమీటర్ల దూరం భారం తగ్గనుంది. ఇప్పటికైనా రోడ్డు భవనాల శాఖ స్పందించి రోడ్డు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.