భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

9, ఏప్రిల్ 2026, గురువారంభారత్ సమాచార్

కౌడిపల్లి గిరిజన గురుకులంలో విద్యార్థుల ఆందోళన

WhatsApp Image 2026-04-08 at 7.22.32 PM

భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: కౌడిపల్లి మండలంలోని ట్రైబల్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల పట్ల జరుగుతున్న వివక్ష, నిర్లక్ష్యంపై జాతీయ ఎస్టీ కమిషన్ స్పందించింది. నాసిరకం ఆహారం, హాస్టల్‌లో మౌలిక వసతుల లేమిపై మంగళవారం సుమారు 100 మంది గిరిజన విద్యార్థులు జాతీయ రహదారి 765Dపై ‘రాస్తా రోకో’ నిర్వహించారు. ప్రిన్సిపాల్, పీఈటీలు తమను కులం పేరుతో దూషిస్తూ వేధిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు.

ఈ ఘటనపై హైదరాబాద్‌కు చెందిన లా విద్యార్థి ధనవత్ జగదీష్ నాయక్ ఫిర్యాదు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 21లతో పాటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. గిరిజన విద్యార్థుల హక్కులను కాపాడి, పాఠశాల నిర్వాహకులపై తక్షణ విచారణ జరపాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.