భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

9, ఏప్రిల్ 2026, గురువారంభారత్ సమాచార్

సురక్షిత మాతృత్వంతోనే ఆరోగ్యవంతమైన సమాజం

WhatsApp Image 2026-04-08 at 6.30.52 PM (2)

భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా కలెక్టరేట్‌లో ‘సురక్షిత మాతృత్వ దినోత్సవం’ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని, తద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు. గర్భిణీలు, బాలింతల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ముఖ్యంగా గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోషకాహారం, సమయానుకూల వైద్య పరీక్షలపై ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు గ్రామీణ స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, డీసీహెచ్ఎస్ శివదయాల్, ప్రొఫెసర్ రాజేశ్వరి, పలువురు వైద్యాధికారులు పాల్గొన్నారు. సురక్షిత ప్రసవాల సంఖ్యను పెంచి మాతాశిశు మరణాల నివారణకు కృషి చేయాలని అధికారులు పిలుపునిచ్చారు.