భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, ఏప్రిల్ 2026, శనివారంభారత్ సమాచార్

దీర్ఘకాలిక వ్యాధులకు హోమియోపతి శాశ్వత పరిష్కారం

WhatsApp Image 2026-04-10 at 7.01.22 PM

భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: తూప్రాన్ పట్టణంలోని ఆయుర్వేద ఆసుపత్రిలో ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని పురస్కరించుకుని హోమియోపతి పితామహుడు డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడ్రిక్ సామ్యేల్ హనెమన్ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తూప్రాన్ ఆర్డీవో జయ చంద్రారెడ్డి మాట్లాడుతూ.. సహజ సిద్ధమైన హోమియోపతి వైద్యం ప్రపంచవ్యాప్తంగా ఎంతో విశ్వసనీయతను సంపాదించుకుందని అన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు, అలర్జీలు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలకు ఈ వైద్య విధానం సమర్థవంతమైన పరిష్కారం చూపుతుందని పేర్కొన్నారు.

భారతదేశంలో సుమారు 38 శాతం ప్రజలు ఈ వైద్యాన్ని ఆదరిస్తున్నారని, తూప్రాన్‌లో పది పడకల ఆయుర్వేద ఆసుపత్రి ఉండటం స్థానికులకు గర్వకారణమని తెలిపారు. అంతకుముందు జగదీష్ ఆర్య ఆధ్వర్యంలో నిర్వహించిన ‘యోగ వాక్’, యోగాసనాలు ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని నింపాయి. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ లయన్ డాక్టర్ జానకిరామ్, సి.ఆర్, విద్యుత్ శాఖ ఏడీఈ జగదీశ్వర్ ఆర్య, యాధాగౌడ్, ఆయుర్వేద ఆసుపత్రి సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాణి శర్మ, డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ బ్లేస్సి, ఫార్మసిస్ట్ వెంకటేశ్వర్ గౌడ్, సురేష్, సౌజన్య, శ్రీనివాస్, కవిత, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.