భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండల కేంద్రంలోని శ్రీమతి రాయారావు సరస్వతి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదివారం ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. కళాశాల టాపర్లుగా నిలిచిన విద్యార్థులను ప్రిన్సిపాల్ బి. శ్రీనివాసులు అభినందించారు. ద్వితీయ సంవత్సరం ఫలితాలు వారు తెలియజేశారు. సీఈసీ గ్రూపునకు చెందిన బి. ఇందుకు 1000కి 746 మార్కులు సాధించి కళాశాల టాపర్వగా నిలిచింది. సీఈసీకి చెందిన సీహెచ్ కీర్తన 1000కి 722 మార్కులతో ద్వితీయ స్థానం సాధించింది. బైపీసీ విద్యార్థిని ఏ. స్పందన 1000కి 716 మార్కులతో తృతీయ స్థానం పొందింది. ద్వితీయ సంవత్సరంలో మొత్తం 50 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 24 మంది ఉత్తీర్ణులై 48 శాతం ఉత్తీర్ణత నమోదు అయింది.
ప్రథమ సంవత్సరం బైపీసీ విద్యార్థిని జి. అనూష 440కి 356 మార్కులతో కళాశాల టాపర్గా నిలిచింది. బి. తేజస్విని 440కి 339 మార్కులతో ద్వితీయ స్థానం సాధించింది. సీఈసీ విద్యార్థిని ఎస్కే. సుమయ 500కి 384 మార్కులతో తృతీయ స్థానం పొందింది. ప్రథమ సంవత్సరంలో మొత్తం 115 మంది విద్యార్థులు హాజరుకాగా, 40 మంది ఉత్తీర్ణులై 35 శాతం ఉత్తీర్ణత సాధించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ బి. శ్రీనివాసులు మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కళాశాల అధ్యాపక బృందం, నాన్ టీచింగ్ సిబ్బంది టాపర్లకు అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో కూడా ఇలాంటి ఫలితాలను అధికమిస్తూ వెల్దుర్తి మండల కేంద్రంలోని ఉన్నటువంటి శ్రీమతి రాయారావు సరస్వతి కళాశాలకు జిల్లాలోని కాకుండా రాష్ట్రంలో మంచి ప్రతిభను కనబరచాలని కోరుకుంటున్నానని అన్నారు.