భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: వనపర్తి పట్టణంలోని 30వ వార్డులో ఇటీవల ఓ ఆగంతకుడు రాత్రి వేళల్లో వీధుల్లో సంచరిస్తుండడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కాలనీవాసులు భద్రతా పరంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు పేర్కొన్నదాని ప్రకారం, గుర్తు తెలియని వ్యక్తులు తరచూ కాలనీలో తిరుగుతూ ఉండటం వల్ల మహిళలు, వృద్ధులు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని, భద్రతను పెంచేందుకు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వార్డ్ కౌన్సిలర్ వెంటనే స్పందించి, కాలనీలో ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే పోలీస్ శాఖ తరచూ పర్యవేక్షణ నిర్వహించి, అనుమానాస్పద వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల భద్రత దృష్ట్యా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు త్వరితగతిన చర్యలు చేపట్టాలని కాలనీవాసులు ఆశిస్తున్నారు.
BHARATH SAMACHAR DIGITAL
15, ఏప్రిల్ 2026, బుధవారంభారత్ సమాచార్