భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: ఆపదలో ఉన్న వారిని కాపాడేందుకు అత్యవసర సేవల ప్రాధాన్యతపై ఇనుగుర్తి మండల కేంద్రంలోని చిన్న బస్టాండ్ వద్ద శుక్రవారం పోలీస్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎస్సై గంగారపు కరుణాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంబులెన్స్ సేవలు, ‘గోల్డెన్ అవర్’ విశిష్టతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి బాధితులను ఆసుపత్రికి తరలిస్తే మృత్యువు నుంచి కాపాడవచ్చని ఎస్సై తెలిపారు.
ప్రస్తుతం వేసవి ఎండలు తీవ్రంగా ఉన్నందున వడదెబ్బకు గురైన వారు లేదా స్పృహ తప్పిన వారు కనిపిస్తే వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఎంటీ ప్రభాకర్, పైలెట్ ప్రశాంత్, పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజలు, వాహనదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి సకాలంలో వైద్యం అందేలా చూడటం ప్రతి పౌరుడి బాధ్యత అని అధికారులు పేర్కొన్నారు.
Tags: