భారత్ సమాచార్ నెట్, ఎన్టీఆర్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం బ్యారేజీలోకి 3,03,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు బ్యారేజీలోని 69 గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తి 2,97,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి పులిచింతల ప్రాజెక్టు నుంచి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది.
వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో మరో రెండు, మూడు గంటల్లో ప్రకాశం బ్యారేజీకి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశముందని అధికారులు తెలిపారు. కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలను, మత్స్యకారులను అప్రమత్తం చేశారు. నది పరివాహక పొలాల్లోకి వెళ్లవద్దని, వేటకు వెళ్లకూడదని సూచించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది.
మరిన్ని కథనాలు
మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి