భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: రంగాపురం హైవేలో బీచుపల్లి కృష్ణానదిలో నిమజ్జనం సంతోషంగా చేసుకుని తిరిగి వెళ్తుండగా జాతీయ రహదారి రంగాపురం స్టేజి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వనపర్తి మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన 12మంది కలిసి బీచుపల్లిలో వినాయకుని నిమజ్జనం కోసం వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో సాయి, శంకర్ అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. యువకుల మృతితో నాచుపల్లి గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
BHARATH SAMACHAR DIGITAL
5, సెప్టెంబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్