భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, ఏప్రిల్ 2026, ఆదివారంభారత్ సమాచార్

వ్యక్తిగత విమర్శలు మానుకోవాలి: గోవర్ధన్ రెడ్డి

WhatsApp Image 2026-04-25 at 5.30.46 PM

భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి: రాజకీయం అంటే ప్రజల కోసం పని చేయడమే తప్ప, వ్యక్తిగత విమర్శలు చేయడం కాదని బీఆర్ఎస్ నాయకుడు గోవర్ధన్ రెడ్డి హితవు పలికారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సీజీఆర్ (CGR) కార్యాలయం కేవలం ఒక ఆఫీసు మాత్రమే కాదని, అది ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించే ‘జనతా గ్యారేజ్’ అని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ, పఠాన్‌చెరు ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మలేదని, ఇక్కడి ఐదు మున్సిపాలిటీల్లో గులాబీ జెండానే ఎగురవేశారని గుర్తు చేశారు. ప్రజలకు ఏ కష్టమొచ్చినా పార్టీలకు అతీతంగా 24 గంటల పాటు సీజీఆర్ కార్యాలయం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.

అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచిస్తూ, గతంలో కాటా శ్రీనివాస్ గౌడ్ సర్పంచ్‌గా ఉన్నప్పుడు సస్పెండ్ అయిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. పఠాన్‌చెరులో ఎమ్మెల్యే జీఎంఆర్ (GMR) ప్రజలకు అండగా ఉన్నారని, గుమ్మడిదలలో సీజీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. ఓటమిని జీర్ణించుకోలేక అనవసర రాజకీయాలు చేయవద్దని, ఇప్పటికైనా గుమ్మడిదల అభివృద్ధిపై దృష్టి సారించాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రాజశేఖర్, సంజీవరెడ్డి, కిషన్, సర్పంచ్ కొమ్ము శ్రీను, ఉప సర్పంచ్ యాదిరెడ్డి, నాయకులు దేవేందర్ రెడ్డి, సత్యనారాయణ, వెంకట్రాంరెడ్డి, పొన్నాలశ్రీనివాస్ రెడ్డి, శేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రెడ్డి, జయపాల్ రెడ్డి, గోపాల్,బక్క సత్యనారాయణ, చిరుమని శ్రీనివాస్, సాయి రెడ్డి, భాస్కర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, రవి మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.