భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

29, ఏప్రిల్ 2026, బుధవారంభారత్ సమాచార్

బాధితులకు సత్వర న్యాయం అందించాలి: ఎస్పీ జానకి షర్మిల

612deb9f-d929-40a1-90ba-778752df984a

భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందించాలని అధికారులకు జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఆదేశించారు. నిర్మల్ జిల్లా భైంసాలోని ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో భైంసా డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జిదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వాటి పరిష్కారం కోసం ఫిర్యాదుదారుల ఎదుటే సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. బాధితులకు చట్టపరంగా అవసరమైన సహాయాన్ని వెంటనే అందించాలని సూచించారు. కుటుంబ సమస్యలతో వచ్చిన పలువురికి కౌన్సిలింగ్ నిర్వహించి రాజీ కుదిర్చారు. అనంతరం పెండింగ్ ఫిర్యాదుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భైంసా ఏఎస్పీ సాయికిరణ్, తదితరులున్నారు.