భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

3, మే 2026, ఆదివారంభారత్ సమాచార్

నకిలీ విత్తనాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

WhatsApp Image 2026-05-02 at 7.14.21 PM

భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: నకిలీ విత్తన రహిత జిల్లాగా మార్చాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో వానాకాలం 2026 సాగుపై నిర్వహించిన కన్వర్జెన్స్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో 25 టాస్క్ ఫోర్స్ బృందాలు నిరంతరం తనిఖీలు చేస్తాయని, అనుమతి లేని విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ ఏడాది 3.26 లక్షల ఎకరాల్లో సాగు అంచనా ఉండగా, రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రైతులు విత్తనాలు కొనేటప్పుడు ఖచ్చితంగా బిల్లులు తీసుకోవాలని, లూజ్ విత్తనాలు కొనవద్దని సూచించారు. అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. పోలీసు యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ అకుల్ కుమార్ జైన్, తహశీల్దార్లు, వ్యవసాయ శాఖ ఏడీఏలు, మండల వ్యవసాయ అధికారులు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.