భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

3, మే 2026, ఆదివారంభారత్ సమాచార్

పెట్రోల్, డీజిల్ కొరతను తీర్చాలి: సీఐటీయూ

WhatsApp Image 2026-05-02 at 7.34.07 PM

భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా చూడాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఇసంపెల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం వద్ద గల పెట్రోల్ బంకు ముందు శనివారం ఆయన పలువురితో కలిసి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంధన సరఫరాను పునరుద్ధరించాలని నినదించారు. ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ.. గత 15 రోజులుగా డీజిల్ అందుబాటులో లేకపోవడంతో సాగు పనుల కోసం రైతులు, పెట్రోల్ లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో ఇంధన కొరత రైతాంగాన్ని కుంగదీస్తోందని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొరతను అధిగమించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి రాజు, రాధిక, సంతోష్, శ్రీను, ఉప్పలయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.