భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

5, మే 2026, మంగళవారంభారత్ సమాచార్

‘చలో వరంగల్’ రైతు సదస్సు పోస్టర్‌ ఆవిష్కరణ

WhatsApp Image 2026-05-04 at 8.25.27 PM

భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్: రైతు సమస్యల పరిష్కారమే ధ్యేయంగా వరంగల్‌లో నిర్వహించనున్న ‘చలో వరంగల్’ రైతు సదస్సును విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈ సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల గళాన్ని వినిపించేందుకు ఈ సదస్సు వేదిక కానుందని, అన్నదాతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ జెర్రిపోతుల వెంకన్న గౌడ్, మాజీకౌన్సిలర్ ఎడ్ల వేణు, మార్నేని రఘు, అజయ్, బిఆర్ఎస్ నాయకులు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.