భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: పేదలకు పక్కా గూడు కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ ఇళ్లు’ పథకం క్షేత్రస్థాయిలో సాకారం అవుతోంది. ఇనుగుర్తి మండల కేంద్రంలో బుధవారం ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు వల్లముల స్పందన-మురళి దంపతులు తమ నూతన గృహ ప్రవేశాన్ని అత్యంత సంబురంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, స్థానిక ఎస్సై కరుణాకర్, సర్పంచ్ కుమార్ తదితరులు హాజరై లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశ క్రతువులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గంట సంజీవరెడ్డి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఇంటి నిర్మాణం వేగంగా పూర్తి చేసుకున్న లబ్ధిదారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో దిశ సభ్యులు గుజ్జునూరి బాబురావు, వార్డు సభ్యులు నద్దునూరి ప్రశాంత్, వేముల శ్రీను, గుజ్జునూరి శ్రీకాంత్, గోపందాస్ కృష్ణ, ఏఎంసీ డైరెక్టర్ కొట్టం రాము, కాంగ్రెస్ మండల, గ్రామ అధ్యక్షులు సతీష్, రాజేందర్ రెడ్డి, జిల్లా నేత కట్టయ్య యాదవ్, సలీం రామ్ తదితరులు పాల్గొన్నారు.