భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి నిరసన తెలిపారు. అర్హులైన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం లేదని హత్నూర మండలంలోని రైతువేదిక వద్ద స్థానికులతో బైఠాయించి నిరసన తెలిపారు. అంగన్వాడీ టీచర్లకు సెల్ ఫోన్లు పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రోసిడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ క్రమంలో అంగన్వాడి టీచర్లకు సెల్ ఫోన్లు పంపిణీ చేసిన అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రోసిడింగ్ పత్రాలు ఏవని స్థానిక ఎంపీడీవో శంకర్ ను నిలదీశారు. కావాలనే లబ్ధిదారులకు ప్రోసిడింగ్ పత్రాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే ఆగ్రహానికి గురయ్యారు. అనంతరం సంగారెడ్డి జిల్లా కలెక్టర్, అలాగే హౌసింగ్ పీడీతో ఫోన్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసిడింగ్ పత్రాలు ఇచ్చేవరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని చెప్పారు.
BHARATH SAMACHAR DIGITAL
7, మే 2026, గురువారంభారత్ సమాచార్