భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

9, మే 2026, శనివారంభారత్ సమాచార్

మహిళా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పాలన

WhatsApp Image 2026-05-08 at 7.29.13 PM

భార‌త్ స‌మాచార్.నెట్, నల్గొండ జిల్లా: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. శుక్రవారం శాలిగౌరారంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 90 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం శాలిగౌరారం స్టేట్ బ్యాంక్ ఎదురుగా చైత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళలు తమ పిల్లలను క్రమశిక్షణతో పెంచాలని సూచించారు. ప్రతి ఏటా వేసవిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, పదో తరగతి విద్యార్థులకు మజ్జిగ పంపిణీ చేయడం వంటి చైత్ర ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. ఇదే క్రమంలో అడ్లూర్ సర్పంచ్ కట్ట లక్ష్మి – వెంకటరెడ్డి ఎమ్మెల్యేను కలిసి, లారీల కొరత లేకుండా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాదూరి శంకర్ రెడ్డి, వైస్ ఛైర్మన్ నరిగె నర్సింహా, సింగల్ విండో ఛైర్మన్ తాళ్లూరి మురళి, వైస్ ఛైర్మన్ చామల మహేందర్ రెడ్డి, తహశీల్దార్ మాధవరావు, డీటీ బిట్ల వరప్రసాద్, సర్పంచులు శేఖర్ బాబు, చాడ కవిత, వంగూరి కవిత, నరిగె యాదయ్య, నాయకులు చాడ సురేష్ రెడ్డి, భూపతి అంజయ్య, బొల్లికొండ గణేష్, పెరుమాండ్ల నరేష్, పుల్లూరి దేవేందర్, ననుబోతు అంజయ్య, యుగేందర్ రెడ్డి, పడాల రమేష్, మంగడుడ్ల శ్రీనివాస్, ఆర్ఐ మహ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.

Tags: